HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktrs Visit To Delhi Meeting With Amit Shah

KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!

  • Author : Hashtag U Date : 23-06-2023 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. కేంద్రం నుంచి రావల్సిన నిధులతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కోరింది.

అయినా సరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిపై ఏ విషయం తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. అందుకే రాష్ట్రం తరపున కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొని రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోకే మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోం శాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇక ఎస్ఆర్డీపీలో భాగంగా తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూములు కావాలి. గతంలోనే ఈ మేరకు రక్షణ శాఖకు లేఖ రాసినా స్పందన లేదు. దీంతో ఈ విషయంపై తేల్చాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ కలవనున్నారు.  వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్టు విషయంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై.. కోరనున్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అవుతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • central govt
  • delhi
  • ktr

Related News

Chandrababu Govt

AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్ర

    Latest News

    • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

    • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    Trending News

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd