HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Will Give Due Recognition For His Great Deeds Congress Mp

Congress MP: కేటీఆర్ నువ్వు చేసిన ఘ‌న‌కార్యాల‌కు త‌గిన గుర్తింపునిస్తారు: కాంగ్రెస్ ఎంపీ

నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.

  • Author : Gopi Date : 09-01-2025 - 2:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress MP
Congress MP

Congress MP: కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్‌ రెడ్డి.. కేటీఆర్‌పై (KTR) మ‌రోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ చేసిన ఘ‌న‌కార్యాల‌కు గాను త్వ‌ర‌లోనే ఈడీ, ఏసీబీ, కోర్టులు త‌గిన గుర్తింపునిస్తాయ‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి కేటీఆర్ చెబుతుంటే న‌వ్వాలో.. ఎడ్వాలో కూడా అర్థం కాట్లేద‌ని చుర‌కలు అంటించారు. ఎంపీ చామ‌ల త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా కేటీఆర్ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి విమ‌ర్శ‌లు చేశారు.

ఎంపీ త‌న ఎక్స్ ఖాతాలో.. తెలంగాణ గురించి తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు. తెలంగాణా కు మీరు ఏం చేశారు? 1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఏంటీ డ్రామారావు అని ప్ర‌శ్నించారు. కుటుంబం మొత్తం పదవులు అనుభవించారు త‌ప్ప‌.. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దళిత సమాజాన్ని మోసం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Also Read: Asteroid Earth Collision: భూమికి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

తెలంగాణ గురించి తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు…

తెలంగాణా కు మీరు చేసినది ఎం ఉంది
1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఎంటి @KTRBRS డ్రామారావు… pic.twitter.com/ueam5ldsuZ

— Kiran Kumar Chamala (@kiran_chamala) January 9, 2025

నమ్మి అధికారం అప్పజెప్పితే వ్యవస్థలను భ్ర‌ష్టు పుట్టించి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కుటుంబం మొత్తం. రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి మీరు వేల కోట్లు కమీషన్లు, భూముల పేరుమీద వెనకేసుకోని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు. 7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి ఫ్రీ వైద్యం అందుతుండాలే అని ఎంపీ విమ‌ర్శించారు. 7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి KG టూ PG ఫ్రీ ఎడ్యుకేషన్ అందుతుండాలే. 7 లక్షల కోట్లు అప్పు అంటే హాస్టలలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుండాలే. 7 లక్షల కోట్లు అప్పు అంటే రైతులకు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేయొచ్చు.. ఇంకా ఎన్నో చేయొచ్చు అని మండిప‌డ్డారు. ఇవేం చేయకుండా రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారంటే అక్రమ కాంట్రాక్టుల ద్వారా అందినకాడికి దోచుకోని తెలంగాణ సంపదను హవాలా ద్వారా దేశం దాటించినట్లే కదా అని ప్ర‌శ్నించారు.

నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రేపోమాపో ఈడీ, ఏసీబీ, కోర్టులు కుడా మీ ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తార‌ని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Congress MP Chamala
  • harish rao
  • hyderabad
  • kcr
  • ktr
  • telangana news
  • telugu news

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

    CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd