Chalo Delhi : 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..?
కవితకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..?
- Author : Sudheer
Date : 26-08-2024 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) 20 మంది ఎమ్మెల్యేల తో ఢిల్లీ(Delhi )కి వెళ్ళబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తుంది. 20 ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కవిత (MLC Kavitha Bail) బెయిల్‌పై వస్తుందని కచ్చితమైన సంకేతాలు ఉన్నాయా? కవితకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..? అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. రేపు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే మార్చి నుండి కవిత జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో కవిత ఇబ్బంది పడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
పైగా ఇదే కేసులో… ఇప్పుడు విచారణ చేపట్టిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా ఇచ్చింది. బెయిల్ ఇచ్చే సందర్భంలో… బెంచ్ చేసిన వ్యాఖ్యలతోనే కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బెయిల్ వచ్చిన, రాకున్నా… 20మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో ఢిల్లీకి కేటీఆర్ పయనం అవుతున్నారని తెలుస్తుంది. కవితకు బెయిల్ వస్తే గ్రాండ్ గా వెల్ కం చెప్పాలని..ఒకవేళ బెయిల్ రాకపోతే ఈడీ, సీబీఐ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేయాలనే ఆలోచన లో కేటీఆర్ అండ్ టీం ఉన్నట్లు వినికిడి. మరి రేపు ఏంజరుగుతుందో అనేది చూడాలి.
Read Also : Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్