Ktr Son Himanshu: ఆనంద్ మహీంద్రా ప్రశ్నకు…అదిరిపోయే జవాబిచ్చిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు.!!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమన్ష్ స్పందించారు.
- Author : hashtagu
Date : 11-08-2022 - 6:59 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమన్ష్ స్పందించారు. గతంలో మహీంద్రా ట్వీట్లకు కేటీఆర్ స్పందించారు. ఇప్పుడు ఆనందర్ మహీంద్రా ట్వీట్ కు కేటీఆర్ కుమారుడు స్పందించడం గమనార్హం.
అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న ఒక సింహం ముఖం ఫొటోను పోస్ట్ చేశారు ఆనందర్ మహీంద్రా. నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తానని నమ్ము అనే వ్యాఖ్యను సింహం చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేకాదు మీ ఇంట్లో ఈ తరహా కేటగిరీ వ్యక్తి ఎవరంటూ ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు హిమాన్షు స్పందించారు. మా ఇంట్లో అయితే మాతాత గారు ( సీఎం కేసీఆర్ ) అంటూ బదులిచ్చారు.
My grandfather 😅 https://t.co/XVgaCCUv3u
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) August 11, 2022