KTR Vs Bandi Sanjay : కేటీఆర్ వారంలోగా క్షమాపణ చెప్పు.. లీగల్ నోటీసుపై బండి సంజయ్
తన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్(KTR Vs Bandi Sanjay) పేరును అస్సలు ప్రస్తావించలేదన్నారు.
- By Pasha Published Date - 12:19 PM, Tue - 29 October 24

KTR Vs Bandi Sanjay : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే తనకు సారీ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తనకు పంపిన లీగల్ నోటీసుల్లో నిరాధార, అవాస్తవ ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా తనకు కేటీఆర్ క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని స్పష్టం చేశారు.
Also Read :Strava App : అగ్రరాజ్యాల అధినేతలకు ‘స్ట్రావా’ గండం.. లొకేషన్లు లీక్
తన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్(KTR Vs Bandi Sanjay) పేరును అస్సలు ప్రస్తావించలేదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీడియా సాక్షిగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని సంజయ్ కోరారు. తనకు పంపిన లీగల్ నోటీసును వారంలోగా వెనక్కి తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ సేవించి ‘ఫోన్ ట్యాపింగ్’కు పాల్పడ్డారంటూ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్‌కు అక్టోబర్ 23న కేటీఆర్ పరువు నష్టం నోటీసు పంపిన సంగతి తెలిసిందే.
Also Read :Bal Sant Vs Lawrence : పదేళ్ల బాల సాధువుకు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు.. ఎందుకు ?
విశాఖపట్నంలో ‘‘రోజ్ గార్ మేళా’’ ప్రారంభించిన బండి సంజయ్
ఇవాళ ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చేతుల మీదుగా 110 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈసందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే చాలా స్పీడుగా పురోగతిని సాధించొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏపీని రెట్టింపు స్థాయిలో అభివృద్ది చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రాజకీయాలను, పంతాలు, పట్టింపులను పక్కనపెట్టి అభివృద్ధికి సహకరించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏపీలో అనేక ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నందున పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ భరత్, స్థానిక మేయర్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.