HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr House Arrested In The Background Of Padi Kaushik Reddys Arrest

KTR House Arrest: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేప‌థ్యంలో కేటీఆర్ హౌస్‌ అరెస్ట్‌!

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?

  • Author : Gopi Date : 14-01-2025 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR revanth
KTR revanth

KTR House Arrest: కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన నేప‌థ్యంలో పోలీసులు గ‌త రాత్రి ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద ఉన్న 10టీవీలో ఇంట‌ర్వ్యూ ముగించుకుని వ‌స్తున్న పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి క‌రీంన‌గ‌ర్‌కు త‌ర‌లించారు. ఈ అరెస్ట్ నేప‌థ్యంలో పోలీసులు క‌రీంన‌గ‌ర్ వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం కౌశిక్ రెడ్దిని కరీంనగర్ కోర్టుకు కాకుండా జడ్జి ఇంటికి పోలీసులు త‌ర‌లించారు. రెండవ అదనపు జ్యుడీషియ‌ల్ మెజిస్ట్రేట్ ఇంటివద్ద ప్రవేశబెట్టారు. ప్ర‌స్తుతం వాదనలు కొన‌సాగుతున్నాయి.

కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ రియాక్ష‌న్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కొనసాగుతున్న కాంగ్రెస్ అణచివేతల పర్వం. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
కాంగ్రెస్ పార్టీ పిరాయింపులను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్ర‌మ అరెస్ట్‌! తమ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పూటకో అక్రమ కేసుతో.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టులు చేయడం అలవాటుగా మార్చుకున్నది రేవంత్ సర్కార్. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అణచివేతలకు దిగుతారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. పోరాటాలే ఊపిరిగా పుట్టి, ప్రజల పక్షాన నిలబడుతున్న గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

Also Read: Rohit Sharma: రంజీ ట్రోఫీలో ముంబై త‌ర‌పున ఆడ‌నున్న రోహిత్ శర్మ?

కొనసాగుతున్న కాంగ్రెస్ అణచివేతల పర్వం

ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?

కాంగ్రెస్ పార్టీ పిరాయింపులను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్ట్!

తమ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పూటకో అక్రమ కేసుతో.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా… pic.twitter.com/TdqCoLCdie

— BRS Party (@BRSparty) January 13, 2025

హ‌రీశ్ రావు స్పంద‌న‌

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?కెసిఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయం. ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎక్స్ వేదిక‌గా నిల‌దీశారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా @KaushikReddyBRS మీద కేసులా?

కెసిఆర్ గారి పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల…

— Harish Rao Thanneeru (@BRSHarish) January 13, 2025

కేటీఆర్ హౌస్ అరెస్ట్‌

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ (KTR House Arrest) చేశారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని గ‌త రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS MLA Padi Koushikreddy
  • congress
  • harish rao
  • KTR House Arrest
  • KTR House Arrested
  • telangana politics

Related News

kalvakuntla Kavitha Party Name TRS

TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్

కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస

    Latest News

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd