KTR : ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం కాదు..గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించండి – కేటీఆర్
ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తిరగడం కాదు ఎప్పుడో పూర్తి అయినా గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజల కష్టాలు తీర్చడండని డిమాండ్ చేసారు
- Author : Sudheer
Date : 12-07-2024 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ (KTR)..వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంఫై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు నిరుద్యోగుల డిమాండ్స్ , మీడియా ఫై పోలీసుల దురుసు వంటి అంశాలపై గళం విప్పిన కేటీఆర్..తాజాగా గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ (Gopanpally Flyover) ప్రారంభం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించకపోవడం ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తిరగడం కాదు ఎప్పుడో పూర్తి అయినా గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజల కష్టాలు తీర్చడండని డిమాండ్ చేసారు. సమర్థ ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
నల్లగండ్ల, గోపాన్‌పల్లి, తెల్లాపూర్ చందానగర్ ప్రజలకు మేలు చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోపాన్‌పల్లి ఫ్లైఓవర్‌ను నిర్మించిందని , ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం లేదని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరగడం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వ్యక్తిగత పీఆర్ మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాల మీద లేదని మండిపడ్డారు. వెంటనే గోపాన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే సర్కార్ దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైన దుస్థితికి దిగజార్చింది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయినయి అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేసారు.
పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్.
“నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు” అనే దశాబ్దాల దుస్థితి నుంచి
“చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనే ధీమానిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.కానీ,
గద్దెనెక్కిన ఆరునెలల్లోనే సర్కారు దవాఖానాల్లో
కనీసం మందు గోళీలు… https://t.co/zYItsKM7XX pic.twitter.com/8vauIcU5By— KTR (@KTRBRS) July 12, 2024
Read Also : Allu Arjun Pushpa 2 : పుష్ప 2.. ఆ విషయం తేల్చని మేకర్స్..!