HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Comments On Revanth Reddy 2

Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్‌ ఇచ్చింది అంటారు.

  • Author : Latha Suma Date : 26-11-2024 - 2:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ktr comments on revanth reddy
ktr comments on revanth reddy

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి విమర్శులు గుప్పించారు. రాహుల్‌ గాంధీ తిట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫస్ట్రేషన్‌లో ఏదోదో మాట్లాడారని, చిట్టి నాయుడు చిప్‌ దొబ్బిందని మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బీఆర్‌ఎస్‌ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ ఏదో పిచ్చి రిపోర్టు విడుదల చేశారని ఎద్దేవా చేశారు. అవన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్‌ ఇచ్చింది అంటారు.

జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా? అని మండిపడ్డారు. ఇంత మూర్ఖంగా ప్రజల తెలివి తేటలను తక్కువగా అంచనా వేసి నోటికి వచ్చినట్లు వాగుతాను అన్నట్లు రేవంత్‌ వ్యవహారం ఉన్నదన్నారు. సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని నాటి పేపర్‌ క్లిప్‌లను మీడియాకు చూపెట్టారు. అదానీకి మేము రెడ్‌ సిగ్నల్‌ వేస్తే.. మీరు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు….రెండో సారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడని అంటున్నారు. మైక్రో సాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని.. అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందని సెటైర్ లు వేశారు. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయిన విషయం గుర్తు చేశారు. మైక్రో సాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని.. అమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు.

తాను.. అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్ లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్ లో పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదని.. కోహినూరు హోటల్ లో కాళ్లు పట్టుకోలేదంటూ ఎద్దేవా చేశారు. తనకు.. నీ లాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదని, ఏదీ చేసిన బజాప్తా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. కొండారెడ్డి పల్లిలో నీకోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు గురించి కూడా మాట్లాడారు. ప్రశ్నిస్తే.. సైకో అంటున్నవని కేటీఆర్‌ విమర్శలు చేశారు.

Read Also: Blood Pledge : ‘‘చోరీ చేస్తే సూసైడ్’’.. ఉద్యోగులతో సంతకాలు చేయించుకున్న బ్యాంక్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adani investments
  • Adani issue
  • brs
  • CM Revanth Reddy
  • ktr
  • rahul gandhi

Related News

Ntr Statue Ammerpet

NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌రుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రము

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Nirmala Sitharaman Makes Key Remarks on Economic Challenges

    Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

  • Cm Convoy

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

Latest News

  • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

  • Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd