Rajiv Gandhi Statue : రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు పై మరోసారి కేటీఆర్ ఆగ్రహం
Rajiv Gandhi Statue : నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా..?
- By Sudheer Published Date - 11:50 AM, Mon - 16 September 24

KTR Comments On Installation of Rajiv Gandhi Statue In Front Secretariat :ఈరోజు (september 16) సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (BR Ambedkar Secretariat) ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. వాస్తవానికి గత నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి రోజు సోనియాగాంధీ, రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
కాగా ఈ విగ్రహ ఏర్పాటు పై బిఆర్ఎస్ (BRS) మొదటి నుండి విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా..? సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని, తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను క్షమించదంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. ‘తెలంగాణ తల్లి’ విగ్రహం పెట్టాల్సిన చోట ‘రాహుల్ గాంధీ తండ్రి’ విగ్రహం పెడతారా..??
తెలంగాణ కాంగ్రెస్‌ను క్షమించదు..!’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ… pic.twitter.com/zLV0I2aQeZ
— KTR (@KTRBRS) September 16, 2024
Read Also : Krithi Shetty : బ్లూ కలర్ చీరలో కృతి శెట్టి అందాల విందు