KTR : రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అంటున్నారు – కేటీఆర్
రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య ఫై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు
- By Sudheer Published Date - 11:53 AM, Wed - 3 April 24

రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు (Water) మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని .. మహిళలు బిందెలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొందని..ముందు నీటి సమస్య ఫై దృష్టి పెట్టాడని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య ఫై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద లు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్ వల్ల వచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు ఉన్నా వినియోగించడం ఈ ప్రభుత్వానికి చేతకవాడం లేదన్నారు. ఫోన్‌ట్యాపింగ్ మీద కాకుండా వాటర్ ట్యాప్ మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈరోజు తాగునీళ్ల కోసం అడుక్కోవాల్సి దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయన్నారు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు విషప్రచారం చేశారని, కేసీఆర్ జనగామ, సూర్యాపేట వెళ్లగానే అదే కాళేశ్వరం నుంచి జలాలను విడుదల చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో నీటికోసం అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తలేదని వెల్లడించారు. నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతున్నదని విమర్శించారు. మూడు, నాలుగు రెట్లు అధికంగా చెల్లించి వాటర్ ట్యాంక్‌తో నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
Read Also : Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’లో కీర్తి సురేష్ హీరోయిన్.. నిజమేనా..!