Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ చేశారా? అనే ప్రశ్నకు KTR సమాధానం ఇదే..!
Phone Tapping : రేవంత్ ను కూడా పిలిపించండి. నేను లైడిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కాబట్టి
- Author : Sudheer
Date : 25-10-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ (Phone Tapping) చేస్తున్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. ‘ఇది నిజమో? కాదో మీరు రేవంత్ రెడ్డి ని ప్రశ్నించండి. లేదంటే లైడిటెక్టర్ తెప్పించి, రేవంత్ ను కూడా పిలిపించండి. నేను లైడిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కాబట్టి. రేవంత్ను కూడా టెస్ట్ చేయించుకోమనండి. ఆయన ట్యాప్ చేయలేదని నేను నమ్ముతా’ అని హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్‌క్లేవ్‌లో చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన సీఎం పదవిలోకి వచ్చాక కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాప్రతినిధిని కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల బ్యాగుతో పట్టుబడిన వ్యక్తిని దొంగ అనకుండా ఇంకేమని అంటారని ప్రశ్నించారు. నాడు మండలి సభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశాడు కాబట్టే ఆయనపై కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పది నెలల కాలంలో అన్నింటా విఫలమైందని, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పి… అమలు చేయలేకపోయారన్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ (KCR) షాక్ లో పడ్డారనే వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ఉక్కు మనిషి అని, ఆయన జీవితంలో చాలా చూశారని, ఇలాంటి ఓటమికి భయపడరన్నారు. రాష్ట్రం గురించే ఆయన ఆందోళన చెందుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బాగు కోసమేనని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, రాజకీయ పరమైన విమర్శలను తెలియజేస్తున్నాయి. గతంలో జరిగిన ఆరోపణలతో, ఆయనపై కేసు పెట్టాల్సి రావడం, పార్టీ రాజకీయాలపై ప్రభావం చూపించే అంశంగా మారింది.
Read Also : Jagan vs Sharmila Assets Fight : ఏపీలో వింత బంధాలను చూస్తున్నాం – పేర్ని నాని సెటైర్లు