Water Issue : కేసీఆర్ అనుమతితోనే జగన్ కృష్ణా జలాలను తరలించుకొని పోయారు – ఉత్తమ్
- Author : Sudheer
Date : 12-02-2024 - 1:01 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ముందుగా అసెంబ్లీ లో చర్చల ఫై తీర్మానం ప్రవేశపెట్టి, ఆ విషయాలను పవర్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్‌పై పోలీసులను పంపించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అందరం ఆశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళుతుందని అన్నారు. పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకుందన్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితోనే AP CM జగన్ కృష్ణా జలాలను తరలించుకుపోయారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కేసీఆర్, జగన్ కు మంచి సంబంధాలున్నాయి. జగన్.. కెసిఆర్ ఇంట్లో బిర్యానీ తిని కృష్ణా నీళ్లు తీసుకెళ్లారు. కెసిఆర్ చాలా గొప్పవారని AP అసెంబ్లీలో జగన్ పొగిడారు. TS జలాలను సైతం APకి ఇస్తున్నారని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా 1987లో 11,500 క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతే 2005లో 44వేలకు, ఇప్పుడు 92,600కు పెంచారు’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ మాట్లాడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. ‘బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 50% ఎక్కువ నీరు ఏపీకి వెళ్లింది. పాలమూరు-రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44వేల క్యూసెక్కులు. 2020లో జగన్ 90వేలకు పెంచారు. అయినా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు’ అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులది అసమర్థతనో, అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
Read Also : Periods: పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?