HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kondagattu Sentiment For Pawan Kalyan Perform Puja Of His Campaign Vehicle

Pawan Kalyan: పవన్ కు ‘కొండగట్టు’ సెంటిమెంట్.. వారాహికి రంగం సిద్ధం!

జనసేన అధినేత (Pawan Kalyan) కొండగట్టులో తన ప్రచార వాహనానికి పూజలు చేయనున్నారు.

  • Author : Balu J Date : 17-01-2023 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena
Varahi

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సెంటిమెంట్ ఎక్కువే. జనవరి 24న తెలంగాణలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తన ప్రచార వాహనం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయనున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ప్రసిద్ధ ఆలయంలో ప్రచార వాహనానికి పూజలు జరగనున్నాయి. జగిత్యాలలోని ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం నుండి దర్శించుకోనున్నారు. అయితే 2009లో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ వాహనంపై హైటెన్షన్ వైర్ పడటంతో తృటిలో తప్పించుకున్నారు. కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని, అందుకే ఈ ఆలయం నుంచే ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని పవన్ బలంగా అంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల సమరానికి (AP Elections) సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత నెలలో ప్రత్యేకంగా రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఆవిష్కరించారు. ప్రచార వాహనంలో హై-సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, CCTV కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముస్తాబైన ఈ వాహనాన్ని ఉద్దేశించి ‘వారాహి ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాడు’ అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మిలటరీ బస్సును తలపించే ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్షుణంగా పరిశీలించాడు. సాంకేతిక నిపుణులతో వాహనం వివిధ ఫీచర్లను చర్చించి, కొన్ని మార్పులను సూచించాడు. ఏప్రిల్-మే 2024లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేయడానికి పవన్ ఈ వాహనాన్ని ఉపయోగిస్తాడు.

ఇక దసరా తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనను (Political tour) ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అదే వాయిదా పడింది. ఇప్పుడు రాబోయే కొద్ది వారాల్లో పవన్ పర్యటనను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఆలివ్ గ్రీన్ వాహనం నడపడానికి పవన్ కళ్యాణ్ కు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారి ఒకరు చెప్పడంతో వాహనం రంగుపై వివాదం చెలరేగింది. మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్మీ సిబ్బందికి తప్ప మరే ప్రైవేట్ వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉపయోగించరాదని అధికారి తెలిపారు. కాగా అధికార వ్యతిరేక (YCP) ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారు.

Also Read: Online Fraud: ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్.. బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు మాయం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kondagattu
  • Pawan Kalyan
  • telangana
  • Varahi

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd