Online Fraud: ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్.. బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు మాయం!
ఏనీ డెస్క్ యాప్ (Any desk app) పేరుతో సైబర్ నేరస్తులు రూ. 5 లక్షలను ఖాతా నుంచి మాయం చేశారు.
- Author : Balu J
Date : 17-01-2023 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
మీరు అదేపనిగా యాప్స్ ను (Any Desk App) డౌన్ లోడ్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఒక వ్యక్తి తన టీవీ ఛానెల్ (TV Channel) సర్వీస్ కు సంబంధించిన టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు ఏకంగా రూ. 5 లక్షలను కొల్లగొట్టారు. జనవరి 14న ఆ వ్యక్తి తన టీవీ ఛానల్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసినప్పుడు ఫోన్‌లో (Phone) మాట్లాడుతున్నప్పుడు, అతనికి మరొక నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ఎనీడెస్క్ యాప్‌ను (Any Desk App) డౌన్‌లోడ్ చేయమని అడిగాడు.
ఆ వ్యక్తి యాప్‌ను డౌన్‌లోడ్ (Any Desk App) చేసిన తర్వాత, అతను లావాదేవీని ప్రారంభించనప్పటికీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా నుండి ₹ 5 లక్షలు డెబిట్ అయ్యింది. దీంతో మోసపోయానని గుర్తించిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 420 (మోసం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై కేసు (Cyber Case) నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Also Read: Job Notification: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్