Komatireddy Venkat Reddy : కేటీఆర్, హరీష్‌లకు సీన్ లేదు.. కేసీఆర్ రావాలంటూ కోమటిరెడ్డి సవాల్
Komatireddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- By Kavya Krishna Published Date - 08:06 PM, Thu - 3 July 25

Komatireddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులపై ఘాటుగా స్పందించిన ఆయన… తాము లెక్క చేయేది కేసీఆర్‌తో మాత్రమేనని స్పష్టం చేశారు. “కేటీఆర్, హరీష్ రావులతో మాట్లాడే అవసరం లేదు. వారు లెక్కలోకి రారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చి చర్చలో పాల్గొంటే… తాము అన్ని అంశాలపై తర్కించేందుకు సిద్ధం” అని పేర్కొన్నారు.
Fire Break : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా
కేసీఆర్ తాము కలిసి ఉద్యమంలో పాల్గొన్నామని, తెలంగాణ ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్న మంత్రి… హరీష్ రావు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయన ట్రాఫిక్ రద్దీపై నిర్వహించిన మీడియా సమావేశంలో చేశారు. రహదారి ప్రణాళికలపై మాట్లాడుతూ… నగరంలో ట్రాఫిక్ భారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో “హ్యామ్ మోడల్”లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎంతో చర్చలు జరిపామని, ఈ నెలాఖరులోగా 15 ప్యాకేజీల పనులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
హ్యామ్ మోడల్ రోడ్లు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 6,500 కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 1,500 కోట్లతో లింక్ బ్రిడ్జిలను నిర్మించిందని… ఇక ఇప్పుడు రూ. 350 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ రోడ్లు, హ్యామ్ రోడ్లను పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అత్యధికంగా జరిగే దేశంగా ఇండియా నిలవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
విజయవాడ రూట్‌లో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్‌ను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క రోడ్డును కూడా వేయకుండా, రూ. 3,400 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు వదిలి కేసీఆర్ ప్రభుత్వం వెళ్లిపోయిందని ఆరోపించారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై త్వరలోనే నితిన్ గడ్కరీ, ప్రధాని మోదీని కలుస్తానని తెలిపారు. ఇప్పటికే 96% భూసేకరణ పూర్తయిందని, కొత్త టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) సదరన్ పార్ట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. హ్యామ్ మోడల్‌లో రాబోయే రోడ్లలో టోల్ వసూలు చేసే ప్రసక్తే లేదని, కేవలం రెండు రూట్లకే టోల్ ప్రపోజల్ ఉందని స్పష్టం చేశారు.
Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం