Telangana Assembly Sessions: హరీశ్‌రావును వాడుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అధికార పక్షంపై కేటీఆర్ తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు
- By Praveen Aluthuru Published Date - 08:15 PM, Wed - 20 December 23
Telangana Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అధికార పక్షంపై కేటీఆర్ తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ హీట్ పుట్టిస్తుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదో మాట్లాడుతుండగా వెంటనే హరీష్ కలుగజేసుకుని నువ్వు లేచి మమ్మల్ని అడ్డుకున్నంత మత్రాన నీకు మంత్రి పదవి రాదంటూ హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీటుగా స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు మంత్రి పదవి విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని, కానీ హరీశ్ రావును మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లు బాగా వాడుకుంటారని, ఆయనకు అక్కడ న్యాయం జరగదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో మాటలు యుద్ధం నడిచింది. ఇరు పార్టీల నేతలు వాగ్వాదంతో హీట్ పుట్టించారు. మాట్లాడేందుకు ఆయనకు చాలా సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు సరికాదన్నారు. మొన్న హరీశ్ రావు తన పేరును వ్యక్తిగతంగా తీసుకున్నారని గుర్తు చేశారు.
Also Read: Mango Rawa Pulihora: ఎంతో టేస్టీగా ఉండే మామిడి రవ్వ పులిహోర.. సింపుల్ గా ట్రై చేయండిలా?