Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ
ఇకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఆయన్ను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 05:14 PM, Thu - 14 November 24

Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendra Reddy) సంచలన లేఖ రాశారు. జైలు నుండి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలు తెలిపారు. పోలీసులు తర పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని తెలిపారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుండి తీసుకోలేదని, ఆయన కూడా చెప్పలేదుని రాసుకొచ్చారు. కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని, అప్పటివరకు అందులో తనకు ఏముందో తెలియదని పేర్కొన్నారు.
ఇకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఆయన్ను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త చేత కలెక్టర్ దారి మళ్లీంచి లగచర్ల గ్రామంలోకి తీసుకువచ్చి దాడి చేసేలా ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గ సాక్ష్యాలను కొన్నింటిని సేకరించారు. అయితే దాడికి ముఖ్య కారకుడైన సురేష్‌కు మాజీ ఎమ్మెల్యే పట్నం దాదాపు 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Google AI Learning : విద్యార్థుల కోసం గూగుల్ ‘లెర్న్ అబౌట్’.. ఏమిటీ ఫీచర్ ?
అలాగే ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు గత రాత్రి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అందులో బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం, కేటీఆర్, ఇతర నాయకులు చెప్పటం వలనే ఈ దాడికి ప్లాన్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే తన రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలతో దాడికి ప్రయత్నించినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక ఈ కేసులో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యేకు వికారాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ దాడితో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. కావాలనే తమను ఇందులో ఇరిక్కిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.
ఫార్మా కంపెనీ విషయమై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇక్కడ పార్మా కంపెనీ పెడితే తరిమికొడదాం.. నేను, కేటీఆర్, హరీష్ రావు అండగా ఉంటాం.’ అని రైతులతో చెప్పినట్లుగా వీడియోలో ఉంది. ముఖ్యమంత్రి వచ్చినా.. కాంగ్రెస్ నాయకులు వచ్చినా.. అధికారులు వచ్చినా కూడా తరిమికొడదామని రైతులను రెచ్చగొట్టినట్లుగా గతంలో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.