Google AI Learning : విద్యార్థుల కోసం గూగుల్ ‘లెర్న్ అబౌట్’.. ఏమిటీ ఫీచర్ ?
లెర్న్ అబౌట్ ఫీచర్(Google AI Learning) ప్రత్యేకత ఏమిటంటే.. ఇది విశ్వసనీయ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి అందిస్తుంది.
- By Pasha Published Date - 04:57 PM, Thu - 14 November 24

Google AI Learning : ఇప్పుడు మనుషులంతా ఉదయం నుంచి రాత్రి దాకా ‘గూగుల్’ చుట్టూ తిరుగుతున్నారు. విద్యార్థులు కూడా తమ చదువులకు సంబంధించిన కీలకమైన సమాచారం కోసం గూగుల్‌పై ఆధారపడుతున్నారు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఒక చక్కటి టూల్‌ను విద్యార్థుల కోసం గూగుల్ తీసుకొచ్చింది. ఆ టూల్ పేరు.. ‘లెర్న్ అబౌట్’. వివరాలివీ..
Also Read :NCAP Safety Ratings : క్రాష్ టెస్టులో మహీంద్రా ‘రాక్స్’.. మూడు వాహనాలకు 5 స్టార్ రేటింగ్
విద్యార్థులు, విద్యావేత్తలకు కావాల్సిన విద్యా సమాచారాన్ని అందించడమే ‘లెర్న్ అబౌట్’ ఏఐ టూల్ ప్రత్యేకత. గూగుల్ LearnLM AI మోడల్ ద్వారా ఈ టూల్‌ను తయారు చేశారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఈ టూల్ హెల్ప్ చేస్తుంది. అంటే ఒక టీచర్‌లా సాయం, గైడెన్స్‌ను అందిస్తుంది. విద్యార్థి ఈ టూల్‌లోకి వెళ్లి ఏదైనా సమాచారాన్ని తెలుసుకోదలిస్తే.. దానికి సంబంధించిన ఆర్టికల్స్, వీడియోస్ ప్రత్యక్షం అవుతాయి. వాటిని చూసి ఆ సబ్జెక్టుకు సంబంధించిన నాలెడ్జ్‌ను పొందొచ్చు.
లెర్న్ అబౌట్ ఫీచర్(Google AI Learning) ప్రత్యేకత ఏమిటంటే.. ఇది విశ్వసనీయ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి ఈ టూల్‌లోకి వెళ్లి.. ‘‘భూమి సైజు ఎంత ?’’ అని అడిగాడు అనుకుందాం. లెర్న్ ఎబౌట్ ఫీచర్ వెంటనే తనలోని ఏఐ అల్గారిథంతో సెర్చ్ మొదలుపెడుతుంది. ఎడ్యూకేషనల్ సైట్స్, ఫిజిక్స్ ఫోరమ్‌లను జల్లెడ పట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొచ్చి విద్యార్థి ఎదుట డిస్‌ప్లే చేస్తుంది. ప్రస్తుతం ‘లెర్న్ అబౌట్’ టూల్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. మనం గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్లి ట్రయల్ ఫీచర్‌గా ‘లెర్న్ అబౌట్’ టూల్‌ను వాడి చూడొచ్చు. టెస్టింగ్ పూర్తయిన తర్వాత విడతల వారీగా ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు.