Telangana: పోటీ నుంచి తప్పుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ తో దోస్తీ
బీఆర్‌ఎస్ పై కాంగ్రెస్ పోరుకు ఊతమిచ్చేలా తెలంగాణ జనసమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరామ్ సోమవారం భేటీ
- Author : Praveen Aluthuru
Date : 30-10-2023 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: బీఆర్‌ఎస్ పై కాంగ్రెస్ పోరుకు ఊతమిచ్చేలా తెలంగాణ జనసమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరామ్ సోమవారం భేటీ అయిన నేపథ్యంలో జనసమితి ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు.
ఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జన సమితిని మార్చి 31 2018న స్థాపించారు. 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన అఖిలపక్ష తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా కోదండరామ్ చైర్మన్‌గా ఉన్నారు, తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో బీఆర్‌ఎస్ 47.4 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ 19 సీట్లు, 28.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
Also Read: SKN : మరో యూట్యూబర్ బేబీ ని హీరోయిన్ గా పెట్టి ..బేబీ నిర్మాత సినిమా