Kishan Reddy Arrest: చంపేస్తే చంపేయండి
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చలో బాటసింగారం పిలుపు మేరకు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు
- By Praveen Aluthuru Published Date - 02:06 PM, Thu - 20 July 23

Kishan Reddy Arrest: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చలో బాటసింగారం పిలుపు మేరకు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో శంషాబాద్ రింగ్ రోడ్డుపై ఆయన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కిషన్ రెడ్డి అక్కడినుంచే కదిలే ప్రసక్తే లేదంటూ రోడ్డుపై భైఠాయించారు. వర్షంలో తడుస్తూనే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు కిషన్ రెడ్డిని బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో కిషన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహించారు. ఒక కేంద్రమంత్రితో ఇలానేనా ప్రవర్తించేది అంటూ మండిపడ్డారు. చంపేస్తే చంపెయ్యండి అంటూ పోలీసుల చర్యను ఖండించారు. బలవంతం చేస్తుండటంతో వారిపై భగ్గుమన్నారు. అయితే ఎట్టకేలకు కిషన్ రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఈటల రాజేందర్, డీకే అరుణను గృహనిర్బంధం చేశారు. ఆ తరువాత రఘునందన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే..
నా అరెస్టుతో @BJP4Telangana ఉద్యమాన్ని ఆపలేరు!
తెలంగాణలోని సొంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుంది. pic.twitter.com/h7ZsOu73ut
— G Kishan Reddy (@kishanreddybjp) July 20, 2023
హైదరాబాద్ శివారు ప్రాంతం బాటసింగారంలో పేదలకు తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆ ఇళ్లను పేదలకు పంపిణి చేసే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చలో బాటసింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పలువురు సీనియర్లను గృహనిర్బంధం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Also Read: Treadmill Shocked: ట్రెడ్‌మిల్ పై జిమ్ చేస్తుండగా షాక్.. అక్కడికక్కడే యువకుడు మృతి!