Kinnera Mogulaiah : సీఎం రేవంత్ ను ఫిదా చేసిన మొగులయ్య
'పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన' అంటూ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయన్ని అభినందించారు
- By Sudheer Published Date - 09:49 PM, Wed - 3 April 24
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని తన పాటతో ఫిదా చేసాడు జానపద కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య (Kinnera Mogulaiah). గుర్తుకువస్తారు. తరాలు మారుతున్నా.. కొత్త కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్నా ఆనాటి కళను వెలుగులోకి తీస్తూ కిన్నెరకు విశేష గుర్తింపు తెస్తున్న మొగులయ్య ఈరోజు బుధువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంపై పాటతో అలరించారు.
‘పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన’ అంటూ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయన్ని అభినందించారు. కాసేపు మొగులయ్య తో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. మొగిలయ్య వెంట తెలంగాణ మంత్రి కొండ సురేఖ కూడా ఉన్నారు. ఇక మొగులయ్య సేవలకు కేంద్రం ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం సైతం మొగులయ్యకు ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను అందజేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మొగిలయ్య గురించి తెలుసుకుంటే..
జానపద కళాకారుడు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య. మరుగున పడిపోతున్న, అంతరించి పోతున్న కిన్నెర వాయిద్యం కళకు అండగా నిలిచిన కళాకారుడిగా మొగిలయ్య గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడటం ద్వారా ప్రపంచ సంగీత రంగానికి పరిచయం అయ్యారు. తెలంగాణలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి చెందిన దర్శనం మొగిలయ్య పేదరికంతో బాధపడుతున్నారు. తన వంశపారంపర్యంగా వచ్చిన కిన్నెర వాయిద్యాన్ని స్వయంగా చేసుకొని పొట్టకూటి కోసం పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాటలు పాడుతూ బతుకు జీవనం కొనసాగిస్తూ వచ్చారు. అయితే భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన తర్వాత ఆయన దశ, దిశ తిరిగిపోయింది. దర్శనం మొగిలయ్య పాడిన పాటకు భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలు భారీ పారితీషికాన్ని అందించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ కూడా స్వయంగా ఆర్థిక సహాయం అందించారు. దాంతో మొగిలయ్య పేదరికం నుంచి కాస్త ఉపశమనం పొందారు. పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత నా జీవితం మారిపోయిందనే విషయాన్ని స్వయంగా మొగిలయ్య చెప్పడం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం గుర్తించడం..రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం ఇలా వరుసగా జరిగిపోయాయి.
Listen to Kinnera Mogulaiah sing for CM Revanth Reddy pic.twitter.com/7bNOevTbvW
— Naveena (@TheNaveena) April 3, 2024
Read Also : Boiled Eggs : గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు..