Deeparadhana: దీపారాధన ఎలా చేయాలి? ఎలా చేయకూడదో మీకు తెలుసా?
Deeparadhana: దీపారాధన చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని ముఖ్యంగా దీపారాధన ఎలా చేయాలి? ఎలా చేయకూడదు అన్న విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:23 AM, Mon - 17 November 25
Deeparadhana: మామూలుగా హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు ప్రతిరోజు దీపారాధన చేస్తే మరికొందరు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొందరు పండుగ సమయాలలో తప్ప మామూలు సమయాలలో పెద్దగా దీపారాధన చేయరు. తరచూ దీపారాధన చేయమని పండితులు చెబుతూ ఉంటారు. దేవుడి ముందు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే చాలు అని అనేక సత్ఫలితాలు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు.
అయితే దీపారాధన చేసే సమయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. దీపారాధన ఎలా చేయాలి ? ఎలా చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా దీపాంతులలో నూనె పోసి ఆ తర్వాత వత్తులు వేయాలి. కానీ కొందరు రివర్స్లో ముందుగా వత్తులు వేసి ఆ తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదట. దీపారాధన కోసం వెండి కుందులు,మట్టి కుందులు, పంచ లోహ కుందులు చాలా మంచివని చెబుతున్నారు. అలాగే స్టీలు కుందుల్లో ఎప్పుడు దీపారాధన చేయకూడదట.
ప్రతిరోజు దీపపు కుందులను శుభ్రం చేసిన తర్వాతనే పూజ చేయాలని చెబుతున్నారు. అంతేకానీ వత్తి మర్చి కుందులను శుభ్రం చేయకుండా అలాగే పూజ చేయడం మంచిది కాదట. అలాగే దీపాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదట. ఒక చిన్న పల్లెలో కానీ లేదంటే తమలపాకుపై కానీ పెట్టాలని చెబుతున్నారు. అలాగే దీపాలను ఎప్పుడూ కూడా నేరుగా వెలిగించకూడదట. అంటే అగ్గిపుల్లతో కాకుండా ఏదైనా అగరబత్తి సహాయంతో దీపాలను వెలిగించాలని చెబుతున్నారు. పొరపాటున కొవ్వొత్తితో అసలు వెలిగించకూడదని చెబుతున్నారు. కాగా ముందుగా ఏక హారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏక హారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలట.అలాగే అగరబత్తీలు, ఏక హారతి, కర్పూర హారతి ఇచ్చేటప్పుడు దీపంతో అసలు వెలిగించకూడదని చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇకమీదట దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.