Boiled Eggs : గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు..
గుడ్డు ఉడకబెట్టినప్పుడు కొన్ని సార్లు అవి ఉడికేటప్పుడే పెంకు పగిలి సొన బయటకు రావడం, పెంకు తీసేటప్పుడు దానికి ఉడికిన గుడ్డు అతుక్కొని రావడం వంటివి జరుగుతాయి.
- Author : News Desk
Date : 03-04-2024 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Boiled Eggs : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక గుడ్డు, గ్లాసు పాలు తాగితే మంచిదని మనకు తెలిసిన విషయమే. అయితే గుడ్డు ఉడకబెట్టినప్పుడు కొన్ని సార్లు అవి ఉడికేటప్పుడే పెంకు పగిలి సొన బయటకు రావడం, పెంకు తీసేటప్పుడు దానికి ఉడికిన గుడ్డు అతుక్కొని రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదట మనం ఎన్ని గుడ్లు ఉడకబెట్టాలి అనుకుంటున్నామో దానికి తగిన పాత్రను ఉపయోగించాలి. చిన్న పాత్రలో ఎక్కువ గుడ్లు ఉడకబెడితే గుడ్లు ఒకదానికి ఒకటి తగిలి మిగిలిపోతాయి. కాబట్టి ముందు మనం గుడ్లకు తగిన పాత్రను ఉపయోగించాలి. గుడ్లను కొంతమంది ఫ్రిజ్ లో పెడుతుంటారు. కాబట్టి ఫ్రిజ్ లో నుండి బయటకు తీసిన వెంటనే ఉడకబెట్టకూడదు. గుడ్లు రూమ్ టెంపరేచర్ కి వచ్చాక అప్పుడు వాటిని ఉడకబెట్టాలి. లేకపోతే ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీయగానే ఉడకపెడితే గుడ్లు పగిలిపోతాయి.
గుడ్లను ఉడకబెట్టడానికి ఉపయోగించే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేయాలి. అప్పుడు గుడ్లు పగలకుండా ఉడుకుతాయి. గుడ్లను ఉడకబెట్టడానికి ఉపయోగించే నీళ్ళల్లో ఒక స్పూన్ వెనిగర్ అయినా వేసి గుడ్లను ఉడికించవచ్చు. ఇలా చేసినా గుడ్లు పగిలిపోకుండా ఉడుకుతాయి. గుడ్లు ఉడికిన వెంటనే వాటిని వేడి నీటి నుండి తీసి చల్లని నీటిలో వేయాలి. ఇలా చేయడం వలన గుడ్లు పెంకు తొందరగా వస్తుంది. అలాగే గుడ్డు వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయ్యాక పొత్తు తీయాలి. ఈ పద్ధతులు పాటిస్తే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.
Also Read : Papaya: బొప్పాయితో ఎన్నో రకాల లాభాలు.. కానీ ఇలా తింటే మాత్రం!