Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక
కిడ్నీలు ఫెయిల్ కావడం, క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లపై(Kidney Problems) నిమ్స్ పరిశోధకులు, పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధన చేస్తున్నారు.
- By Pasha Published Date - 08:43 AM, Wed - 12 March 25

Kidney Problems: తెలంగాణలో కిడ్నీ వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి. గతంలో కిడ్నీ వ్యాధుల బాధితుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లకు పైబడిన వారే ఉండేవారు. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లలోపు కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈమేరకు వివరాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి పరిశోధకులు ఒక నివేదికను విడుదల చేశారు.
Also Read :Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
నిమ్స్ నివేదికలోని కీలక అంశాలివీ..
- కిడ్నీలు ఫెయిల్ కావడం, క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లపై(Kidney Problems) నిమ్స్ పరిశోధకులు, పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధన చేస్తున్నారు.
- పదేళ్ల క్రితం నిమ్స్‌కు కిడ్నీ కేసులు నెలకు సగటున 5 నుంచి 10 మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం ఈ సంఖ్య నెలకు 50 దాటింది.
- నిమ్స్‌లో ఏటా కొత్తగా డయాలసిస్ అవసరమయ్యే వారి సంఖ్య 3500 వరకు ఉంది.
- తెలంగాణలోని పట్టణ ప్రాంతాల ప్రజలు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి కారణంగా బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. వారి కిడ్నీలు పాడవుతున్నాయి.
- తెలంగాణలోని పల్లెల్లో ప్రజలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటోంది. దీంతో వారు నొప్పులు తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి.
- జీవనశైలి సక్రమంగా లేక చాలామంది బీపీ, షుగర్ బారినపడుతున్నారు.
- షుగర్ వ్యాధిగ్రస్తులు సరిగ్గా మందులు వాడక, మూడు నాలుగేళ్లకే కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.
- షుగర్ వచ్చినా, కొందరిలో అనారోగ్య లక్షణాలు బయటపడవు. అలాంటి వారు నిర్లక్ష్యం వహించి, చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
- తెలంగాణలో గత పదేళ్లలో కిడ్నీలు ఫెయిల్ కావడం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేసులు పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా మగవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
- 20-30 ఏళ్ల పురుషుల్లో ఇటీవల కాలంలో ఐజీఏ నెఫ్రోఫతి కేసులు పెరుగుతున్నాయి.
- ఐజీఏ నెఫ్రోఫతి అనేది కిడ్నీ వ్యాధి. కిడ్నీల్లో యాంటీబాడీలు ఏర్పడి మూత్రపిండాల్లో ఉండే చిన్నచిన్న ఫిల్టర్ల (గ్లోమెరులి)కు నష్టం కలిగిస్తాయి. ఫిల్టర్లు సాధారణంగా రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని వడపోసి కిడ్నీకి పంపుతాయి. ఐజీఏ ప్రొటీన్ ఈ వడపోతను నిరోధిస్తుంది.
- తెలంగాణ మహిళల్లో లూపస్ నెఫ్రోసిస్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీర కణాలు, అవయవాలపై రోగనిరోధక వ్యవస్థే దాడి చేస్తుంది. లూపస్ నెఫ్రోటిస్ వల్ల ఆడవారి మూత్రంలో ఎక్కువగా ప్రొటీన్ పోతుంది. జుట్టు రాలుతుంది. శరీరమంతా వాస్తుంది.
- తెలంగాణలో 2013-24 మధ్య కాలంలో 2235 కిడ్నీ మార్పిడి సర్జరీలు జరిగాయి.
- రాష్ట్రంలో డయాలసిస్ బాధితులు ఏటా 2 వేల మంది చనిపోతున్నారు.
- తెలంగాణలోని పిల్లల్లోనూ కిడ్నీ కేసులు పెరుగుతున్నాయి. కిడ్నీ ఆకారంలో తేడాలు ఉండటం, జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి.