Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్..అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్
Telangana BJP Chief : గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజుల పాటు కీలక నేతలతో చర్చలు జరిపారు
- By Sudheer Published Date - 09:25 PM, Tue - 11 March 25

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి(Telangana BJP Chief )కి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Malkajgiri MP Etala Rajender) పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఆయనను ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ (BJP) వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజుల పాటు కీలక నేతలతో చర్చలు జరిపారు. చివరికి ఏకాభిప్రాయంతో ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఈ పదవిలో ఉన్నప్పటికీ, తాజా మార్పుల నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి కొత్త నేతగా ఈటల బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Posani : రేపు జైలు నుండి పోసాని విడుదల..?
ఇటీవల ఈటల రాజేందర్ తన కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, ఈ పదవి ఆయనకే ఖరారైనట్లు సంకేతమిచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై మోదీతో చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీజేపీ హైకమాండ్ తెలంగాణలో గణనీయమైన మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. ఈటలకు వ్యతిరేక వర్గాలు బలంగా ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అనుబంధం కలిగిన నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు వాదించారని సమాచారం. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతుండడంతో, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Fact Check : బరేలీలో భారత్ భూగర్భ అణుపరీక్షలు.. భారీ బిలం !?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తి వచ్చే ఎన్నికల వరకు ఆ బాధ్యతలను కొనసాగించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ సీఎం నినాదాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించడం, ఈటల రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకునే జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ శక్తిని పెంచేందుకు, పార్టీని ఎన్నికల వరకు సమర్థవంతంగా నడిపించగల నేతగా ఈటల రాజేందర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిగా ఈటల బాధ్యతలు స్వీకరిస్తే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ బలపడే దశలో ఉండటంతో, ఈటల నాయకత్వంలో బీజేపీకి ఎలా ఊతం లభిస్తుందనేది ఆసక్తిగా మారింది.