Khammam : ప్రాణం తీసిన మానవతా దృక్పథం… బైక్ లిఫ్ట్ ఇచ్చింనందుకు..?
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని...
- By Prasad Published Date - 09:10 AM, Tue - 20 September 22

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని బాణాపురం వల్లబి గ్రామాల మధ్యలో జమాల్ సాహెబ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా ఓ గుర్తు తెలియన వ్యక్తి టూవీలర్ లిఫ్ట్ అడిగాడు. అయితే లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై వెనుక నుండి సూది మందు ప్రయోగం జరిగినట్లు అక్కడి స్థానికులు చెప్తున్నారు. సూది ఇచ్చిన వెంటనే జమాల్ సాహెబ్ విరుచుక పడి చనిపోయినట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (50) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి గ్రామంలోని తన కూతురును చూసేందుకు వెళ్తున్నాడు . ముదిగొండ మండలం బాణాపురం వద్ద వల్లభి వెళ్లే రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. మానవతా దృక్పథంతో అటువైపే వెళ్తున్నాననే ఉద్దేశంతో జమాల్ సాహెబ్ బైక్ ఆపి అతన్ని ఎక్కించుకున్నాడు. రోడ్డుపై వెళ్తుండగా వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి కుక్కలకు వేసే ఇంజక్షన్ ను జమాల్ సాహెబ్ కు పొడిచాడు. దీంతో ఆయన విలవిల్లాడుతూ నేలకూలాడు ఆ తర్వాత అదే బైక్ తో ఆ దుండగుడు పరారయ్యాడు. అటుగా రోడ్డుపై వేరే వాహనాల్లో వెళ్లే వారు ఈ విషయాన్ని గమనించారు . వెంటనే జమాల్ సాహెబ్ ను సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు . విషయం తెలిసిన ముదిగొండ ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు