HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs Downfall Has Begun Declares Amit Shah At Telangana Rally

Amit Shah Attacks KCR: కేసీఆర్ సర్కార్ పతనానికి ఇదే ఆరంభం : అమిత్ షా

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

  • Author : Naresh Kumar Date : 21-08-2022 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Amit Shah

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని చెప్పారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం… మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు సంక్షేమ పథకాలు తెలంగాణ రైతాంగానికి అందకుండా చేసి పాపానికి పాలుపడుతున్నారనీ ఆరోపించారు. తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్ 2014 నుంచి మూతపడిందనీ, కేసీఆర్ కుటుంబానికి అయితే రిక్రూట్‌మెంట్ ఓపెన్ ఉందన్నారు.అయితే తెలంగాణ యువతకు మాత్రం రిక్రూట్‌మెంట్ లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమన్న ఆయన తన ప్రభుత్వం ఏర్పడితే దళిత/షెడ్యూల్డ్ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.
దళిత సోదరులు మళ్లీ ఈ అవినీతిపరుల ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సహకరిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రావచ్చు గానీ ఏ దళిత వ్యక్తిని సీఎం కానివ్వరనీ అమిత్ షా అన్నారు. తన ప్రసంగంలో అమిత్ షా మజ్లిస్ , కేసీఆర్ దోస్తీ పైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం వమ్ము చేసిందనీ, మజ్లిస్ భయంతో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. మోదీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామనీ అమిత్ షా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి జోస్యం పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

https://twitter.com/AmitShah/status/1561362869153038337

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం లాంటిదని అమిత్ షా చురకలు వేశారు. తెలంగాణలోనే అధిక ధరలు వున్నాయని.. పెట్రో ధరలు ఎక్కువని, పన్నులు కూడా తగ్గించలేదని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రో ధర తగ్గించిందని.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అమిత్ షా చురకలు వేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా వుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు.

 

Live from Public Meeting from Munugode. https://t.co/4v9YxZZKuB

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 21, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • kcr
  • Munugode
  • Telangana BJP
  • telangana politics
  • telangana rally

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • Kcr Bday

    KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • CBDC

    సీబీడీసీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి?

  • Kalvakuntla Kavitha

    జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd