HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs Commitment To The Development Of Telangana Women Mlc Kavitha

MLC Kavitha: ఆడబిడ్డల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట: ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

  • Author : Balu J Date : 13-06-2023 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.

కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తో ఇంటి డాక్టర్ లా, కేసీఆర్ కిట్ తో మేనమామలా, అమ్మఒడి తో సంరక్షకుడిలా,
ఆరోగ్య లక్ష్మి తో ఆరోగ్య దాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలు భాగస్వామ్యం చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటికోసం కిలోమీటర్ల దూరం నడవకుండా, ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్ వాడి, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని చెప్పారు.

“తెలంగాణ మహిళా లోకానికి అన్నగా, తమ్ముడిగా, మేనమామగా, ఇంటి పెద్దగా.. అన్నీ తానై ఆడబిడ్డకు ఏ ఆపదా రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న మహిళా పక్షకపాతి మన కేసీఆర్ ” అని ప్రకటించారు. ఈ దశాబ్దంలో మహిళా సంక్షేమంలో దేశంలో తెలంగాణ దరిదాపుల్లోకి కూడా మరే రాష్ట్రం రానంత రీతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను రూపొందించి, దిగ్విజయంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది పొందారని, 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా, మహిళా సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రంలో స్త్రీ జాతి సగర్వంగా, సంతోషంగా జీవించడం ఒక మహిళగా నాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.

ఆసరా పెన్షన్లతో అండగా నిలబడ్డ కేసీఆర్

వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడి కార్మికులకు తెలంగాణలో మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. 15, 85, 088 మంది వితంతువులకు నెలకు రూ. 2016 చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 20556.11 కోట్ల మేర పెన్షన్ రూపంలో అందించిందని, 143930 మంది ఒంటరి మహిళలకు రూ.1545.8 కోట్ల మేర పెన్షన్లు అందించిందని వివరించారు.

Also Read: Megastar Chiranjeevi: ‘ముల్లోక వీరుడు’గా మెగాస్టార్, ఎనిమిది హీరోయిన్స్ తో చిరు రొమాన్స్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • MLC Kavitha
  • telangana
  • womens

Related News

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd