KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కెసిఆర్
కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
- By Vamsi Chowdary Korata Published Date - 05:28 PM, Sat - 27 January 24

Telangana KCR : ఫిబ్రవరి 1వ తేదీన మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కెసిఆర్ (KCR) ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to join.
గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కెసిఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45 వేల మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బిజెపి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. కానీ నాటి ముఖ్యమంత్రి అభ్యర్థులు కెసిఆర్, రేవంత్ రెడ్డిలని ఓడించి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.
కాగా, ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బిజెపి ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా.. గజ్వేల్‌లో కెసిఆర్ వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో ఆయనకు 1,11,684 ఓట్లు పోలయ్యాయి. 45వేలకుపైగా మెజారిటీ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుంచి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు.
Also Read: Lavanya Tripathi : వైజాగ్ బీచ్ ను శుభ్రం చేయబోతున్న లావణ్య త్రిపాఠి.. అదంతా దానికోసమే?