Lavanya Tripathi : వైజాగ్ బీచ్ ను శుభ్రం చేయబోతున్న లావణ్య త్రిపాఠి.. అదంతా దానికోసమే?
ఈ విషయాన్ని అటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 5:23 IST
Published By : Hashtagu Telugu Desk
Lavanya Tripathi : టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా లావణ్య (Lavanya Tripathi) గత ఏడాది వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాలలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ విషయాన్ని అటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఎట్టకేలకు ఇద్దరూ ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలను ఒప్పించి మరి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ మిస్ పర్‌ఫెక్ట్. ఇందులో క్లీనింగ్ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు.
అలాగే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ విడుదల అవ్వగా అవి వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసాయి. కాగా మిస్ పరఫెక్ట్ టీమ్ తమ ప్రమోషన్స్‌ను కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. నేషనల్ క్లీన్లినెస్ డే వేడుకల్లో భాగంగా రేపు అనగా ఆదివారం జనవరి 28న విశాఖపట్నంలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొననుంది. ఉదయం 6గంటలకు వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిసరాలను క్లీన్ చేయనున్నారు .లావణ్యతో పాటు హీరో అభిజిత్ కూడా ఈ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొననున్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మిస్ పర్‌ఫెక్ట్ టీమ్‌తో పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ కోరింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Chiranjeevi: మెగాస్టార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన మోహన్ బాబు.. నెట్టింట ట్వీట్ వైరల్?