HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr To Move Previlege Motion On Pm Modi Remarks On Telangana

Telangana Issue : ప్రివిలేజ్‌..అహంకారం వ‌ర్సెస్ ఉద్య‌మం!

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ‌డానికి కార‌ణం ప్ర‌జా ఉద్య‌మ‌మా? కాంగ్రెస్ అహంకార‌మా? అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

  • Author : CS Rao Date : 09-02-2022 - 1:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Kcr Sonia Telangana Map
Modi Kcr Sonia Telangana Map

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ‌డానికి కార‌ణం ప్ర‌జా ఉద్య‌మ‌మా? కాంగ్రెస్ అహంకార‌మా? అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రివిలేజ్ క‌మిటీ ఎదుట తేల్చుకోవ‌డానికి టీఆర్ఎస్ రెడీ అయింది. మోడీపై రాజ్య‌స‌భ‌లో నోటీస్ ఇవ్వ‌డానికి ఉన్న న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ఆ పార్టీ ప‌రిశీలిస్తోంది. రాజ్య‌స‌భ ఎంపీ కేశ‌వ‌రావు అధ్య‌ర్యంలోని టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ టీం ప్రివిలేజ్ మోష‌న్ ను మూవ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను అధిగ‌మించ‌డానికి నిపుణుల‌తో ఢిల్లీలో కేశ‌వ‌రావు స‌మావేశం అయ్యాడు. పార్ల‌మెంట్లో మోడీపై ప్రివిలేజ్ మోష‌న్ ఇవ్వ‌డం ద్వారా ప్ర‌త్యేక రాష్ట్రం ఎలా ఏర్ప‌డింది? విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డంలేదు? అనే అంశాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.వాస్త‌వంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో 1994లోనే ప్ర‌త్యేక రాష్ట్రం అంశం ఉంది. ఆ త‌రువాత మారిన రాజకీయ ప‌రిస్థితుల్లో అ అంశం మూల‌న‌ప‌డింది. చంద్ర‌బాబునాయుడుతో విభేదించి టీడీపీ నుంచిబ‌య‌ట‌కొచ్చిన కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్ర అంశాన్ని2001 నుంచి రేకెత్తించాడు. క్షేత్ర స్థాయిలోని ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గమ‌నించిన కాంగ్రెస్ 2004 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో మ‌ళ్లీ ప్ర‌త్యేక‌తెలంగాణ అంశాన్ని పెట్టింది. ప్ర‌తి స‌భ‌లోనూ సోనియాతో తెలంగాణ ప్ర‌జల‌కు హామీ ఇప్పించారు. ఆనాడు చంద్ర‌బాబును రాజ‌కీయంగా అడ్డుకోవ‌డానికి ఈ అంశం బాగా ప‌నిచేస్తుంద‌ని కాంగ్రెస్ అంచ‌నావేసింది. ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2004లో కాంగ్రెస్ గాలి వీయ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ తో పాటు అడుగు పెట్టారు. అప్ప‌టినుంచి ప్ర‌తి సంద‌ర్భంలోనూ అసెంబ్లీ బ‌య‌ట‌,లోప‌ల తెలంగాణ సెంటిమెంట్ ను రాజ‌కీయంగా ర‌గిలించారు. కానీ, స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం గా ఉన్నంత కాలంగా పెద్ద‌గా ప్ర‌త్యేక రాష్ట్ర వాదం రాజ‌కీయంగా వినిపించ‌కుండా చేయ‌గ‌లిగాడు. అడ‌పాద‌డ‌పా జ‌రిగే ఆందోళ‌న‌ల‌ను ఆయ‌న కంట్రోల్ చేస్తూ వ‌చ్చాడు. కానీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీపై సీడ‌బ్ల్యూసీ లో సోనియా ఒత్తిడి చేయ‌డంతో ఏకాభిప్రాయం కోసం ప్ర‌ణ‌బ్ క‌మిటీని ఆనాడు వేశారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ త‌న ప‌ద్మ‌వ్యూహంలోకి లాగింది.రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేక తెలంగాణ కోసం ప్ర‌ణ‌బ్ క‌మిటీలోకి లేఖ‌లు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్ప‌డింది. సీపీఎం మిన‌హా అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వ‌డానికి అభ్యంత‌రం లేద‌ని లేఖ‌లు ఇచ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చేయాల‌ని సోనియా గ్రౌండ్ ప్రిపేర్ చేశార‌ని ఢిల్లీ కాంగ్రెస్ వ‌ర్గాల‌కు తెలుసు. కానీ, స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ ఒత్తిడి మేర‌కు ఆనాడు వాయిదా ప‌డింద‌ని ఢిల్లీ పెద్ద‌లు ఇప్ప‌టికే చెబుతుంటారు.

తెలంగాణ‌కు అనుకూలంగా లేఖ‌లు ఇచ్చిన టీడీపీ,టీఆర్ఎస్‌, వామ‌ప‌క్షాలు కూట‌మిగా 2009 ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఇక తెలంగాణ రావ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు. అక‌స్మాత్తుగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని మ‌రింత దూకుడుగా తీసుకెళ్లాడు. ఆనాడున్న సీఎం రోశయ్య మెత‌కవైఖ‌రి కార‌ణంగా నిఘా గ‌ట్టుత‌ప్పింది. ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌క‌పోతే శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడే ప‌రిస్థితి లేద‌నే కోణంలో నిఘా నివేదిక ఇచ్చాడ‌ని స‌మైఖ్య‌వాదులు ఇప్ప‌టికీ చెబుతుంటారు.ఉద్య‌మాన్ని కంట్రోల్ చేయ‌లేక‌పోయాడ‌ని రోశ‌య్య బ‌దులుగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టింది. ఇక ఆనాటి నుంచి రాజ‌కీయ‌ప‌ర‌మైన చాణ‌క్యానికి కేసీఆర్ ప‌దును పెట్టాడు. అప్ప‌టికే రాష్ట్రం ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీలోని కోర్ క‌మిటీకి సోనియా తెలియ‌చేసింది. రాజకీయంగా న‌ష్ట‌పోయిన‌ప్ప‌టికీ ఇచ్చిన మాట ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దామ‌ని ఆమె సిడ‌బ్ల్యూ స‌మావేశాల్లో చాలా క్లారిటీగా చెప్పింది. ఆ విష‌యం రాష్ట్రంలోని సీనియ‌ర్లు, సీఎంలుగా ఉన్న వాళ్ల‌కు తెలుసు. అందుకే, ఉద్య‌మాన్ని అదుపు చేయ‌లేక‌, స‌మైఖ్య వాదుల‌ను కాద‌న‌లేక నానా ఇబ్బందులు ప‌డ్డారు. ఆ స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చాడ‌ట‌. దాంతో ఇక సోనియా మ‌రో ఆలోచ‌న చేయ‌కుండా రాష్ట్రాన్ని విడ‌దీస్తున్న‌ట్టు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబ‌రం ద్వారా వెల్ల‌డించింది. ఒక‌వైపు ఉద్య‌మం చేస్తూనే కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఫ‌లితంగా ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది.

కాంగ్రెస్ అహంకారం, రాజ‌కీయ దాహం కార‌ణంగానే ఉమ్మ‌డి ఏపీ విడిపోయింద‌ని తాజాగా ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పాడు. దీంతో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని కించ‌ప‌రిచాడ‌ని టీఆర్ఎస్ లాజిక్ లాగింది. ఉద్య‌మం కంటే కాంగ్రెస్ అహంకారం కార‌ణంగా ఉమ్మ‌డి ఏపీ విడిపోయింద‌ని మోడీ తేల్చేశాడు. ప‌రోక్షంగా తెలంగాణ ఉద్య‌మాన్ని అప‌హాస్యం చేసిన మోడీపై ప్రివిలేజ్ మోష‌న్ మూవ్ చేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదే జ‌రిగితే, మ‌రోసారి పార్ల‌మెంట్ వేదిక‌గా తెలంగాణ సెంటిమెంట్ , ప్ర‌త్యేక‌ రాష్ట్ర ఉద్య‌మం, స‌మైఖ్యవాదం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్పుడు మోడీ చుట్టూ ప‌ద్మ‌వ్యూహం అల్లొచ్చ‌ని కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. సో..ప్రివిలేజ్ మోష‌న్ మూవ్ అయితే…విభ‌జ‌న అంశాలు, ఉద్య‌మంలోని లోగ‌ట్టు త‌దిత‌ర అంశాల‌పై ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pm modi
  • sonia gandhi
  • telangana

Related News

Liquor Price

Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • No change in Karnataka Chief Minister for now Congress President Mallikarjun Kharge

    Karnataka : సీఎం కుర్చీ ఖాళీగా లేదు: ఖర్గే మల్లికార్జున ఖర్గే

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

Latest News

  • Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు 2026

  • Skoda : గ్రామీణ ప్రాంతాల్లో స్కోడా కార్ల అమ్మకాలు

  • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

  • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

  • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd