HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Likely To Attend Kaleshwaram Commission Investigation On June 5th

KCR: కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు కేసీఆర్‌.. ఆ లేఖ త‌ర్వాతే ఎందుకు?

NDSA రిపోర్ట్‌లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్‌లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది.

  • Author : Gopichand Date : 27-05-2025 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Health Update
KCR Health Update

KCR: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్‌కు సంబంధించి లార్సెన్ అండ్ టర్బో (L&T) రాసిన లేఖ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మొదట్లో కేసీఆర్ ఈ విచారణ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి మీడియా ముందు పలు వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు పరిశీలన తర్వాత నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆదేశించింది. కొత్త చైర్మన్ నియామకంలో జాప్యం కారణంగా విచారణ కూడా ఆలస్యమైంది. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ విచారణకు భయపడుతున్నారని విస్తృత ప్రచారం చేసింది.

Also Read: IPL 2025 Beautiful Cheerleader: ఐపీఎల్ 2025లో అంద‌మైన చీర్‌లీడ‌ర్ ఈమే?

అయితే ప్రజల్లోని అపోహలను తొలగించడం, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లక్ష్యంగా కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరవనున్నట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా స్వయంగా హాజరవుతారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కమిషన్ నుండి కొన్ని ప్రశ్నలు ముందుగానే కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. ఇది ఆయనకు సమాధానాలను సిద్ధం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

NDSA రిపోర్ట్‌లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్‌లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది. 2016లో నాణ్యత నియంత్రణ మాన్యువల్, త్రైమాసిక నాణ్యత తనిఖీలు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ధృవీకరణలను సమర్పించినట్లు పేర్కొంది. ఈ లేఖ కేసీఆర్, హరీష్ రావులు మొదటి నుండి చెబుతున్న “నిర్మాణంలో నాణ్యత లోపాలు లేవు” అనే వాదనకు బలం చేకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి, నిర్మాణ లోపాలను ఆరోపిస్తూ రాజకీయంగా దూషిస్తోంది. అయితే L&T లేఖ, కేసీఆర్ విచారణకు హాజరయ్యే నిర్ణయం BRSకు రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూర్చవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kaleshwaram
  • Kaleshwaram commission
  • kcr
  • L&T
  • NDSA
  • telangana news

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

    Latest News

    • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

    • TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

    • Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

    • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd