HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Karimnagar Public Meeting Speech

Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్

  • Author : Sudheer Date : 12-03-2024 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Cng
Kcr Cng

రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో కేసీఆర్ (KCR) మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్‌ భగీరత పథకం తీసుకొచ్చి..బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివిలేదా..? ఎందుకు మిషన్‌ భగీరథలో సమస్యలు వస్తున్నయ్‌..?’ అని ప్రశ్నించారు. నేను సీఎం అయినప్పుడు ఏడాదినర్థం తిరగకుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతుబంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతుబంధు ఏసుడు చేతనైతలేదా..? కేసీఆర్‌ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసినట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మిదేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్తలేదా..?’ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు.. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలని కేసీఆర్ తెలిపారు.. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే.. తాము రైతు బంధు వేయకున్నా, కరెంటు, నీళ్లు ఇవ్వకపోయినా గెలిపిస్తారని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటారన్నారు. కాంగ్రెస్ వాళ్ల నైజం అది.. మనం చూడని కాంగ్రెస్ ప్రభుత్వమా అని వ్యాఖ్యానించారు.

ఇక బిజెపి ఫై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఒక నవోదయ స్కూల్‌ గానీ, ఒక మెడికల్‌ కాలేజీ గానీ ఇవ్వని మోదీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని అన్నారు. బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు ఎంత తేడా ఉందో గమనించాలని కేసీఆర్ అన్నారు.

Read Also : KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Karimnagar Public Meeting
  • kcr

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గ

    Latest News

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd