MLA Maganti Gopinath Dies : గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
MLA Maganti Gopinath Dies : మాగంటి భౌతికకాయాన్ని సందర్శించిన మాజీ సీఎం కేసీఆర్ (KCR) భావోద్వేగానికి లోనయ్యారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి మరణాన్ని తట్టుకోలేక పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు
- By Sudheer Published Date - 12:32 PM, Sun - 8 June 25

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) ఆకస్మిక మరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అనారోగ్యం తో ఈ నెల 5వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 5:45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. మాగంటి భౌతికకాయాన్ని సందర్శించిన మాజీ సీఎం కేసీఆర్ (KCR) భావోద్వేగానికి లోనయ్యారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి మరణాన్ని తట్టుకోలేక పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు.
Tragic : బక్రీద్ రోజు మేకకు బదులు తన గొంతుకోసుకుని ఆత్మహుతి..
మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం 1983లో టీడీపీ ద్వారా ప్రారంభమైంది. 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన ఆయన, ఆ తర్వాత బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్‌ను 16 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి తన బలాన్ని చాటారు. ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
Tragedy: ఢిల్లీని కుదిపేసిన దారుణం.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక సూట్‌కేసులో శవమై
మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ..మాగంటి మృతి పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు. పార్టీ శ్రేణుల గుండెల్లో గోపీనాథ్ చిరకాలం నిలిచిపోతారని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
మాగంటి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్ గారు, అనంతరం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.… pic.twitter.com/A3S4riSD96
— BRS Party (@BRSparty) June 8, 2025