HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Developing New Political Strategy

Telangana Politics:అదే జరిగితే టీ కాంగ్రెస్ క్లోజ్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి కమ్యూనిస్టుల భుజం మీద కెసిఆర్ తుపాకీ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రగతిభవన్లో సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో కేసీఆర్ భేటీ వెనుక మాస్టర్ స్కెచ్ లేకపోలేదు.

  • By CS Rao Published Date - 10:37 AM, Sun - 9 January 22
  • daily-hunt
KCR communist leaders
KCR communist leaders

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి కమ్యూనిస్టుల భుజం మీద కెసిఆర్ తుపాకీ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రగతిభవన్లో సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో కేసీఆర్ భేటీ వెనుక మాస్టర్ స్కెచ్ లేకపోలేదు. నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలని 2018 నుంచి ఆయన చెబుతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ అప్పుడప్పుడు టూర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చూసాం. కానీ ఆయన పొలిటికల్ ఎత్తుగడలు సహజంగా తెలంగాణలో అధికారం కోసం ఉంటుంది. మళ్ళీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి ఎలా రావాలి అనేది ఆయన మొదటి ప్రాధాన్యం ఉంటుందని అందరికి తెలిసిందే.
టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఈసారి ఎక్కువగా ఉంటుందని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. దుబ్బాక, గ్రేటర్, హుజురాబాద్ ఫలితాలు ఈసారి అధికారంపై అనుమానం కలిగిస్తున్నాయి. అందుకే 2023 స్కెచ్ ని గెలుపు దిశగా కాంగ్రెస్ మీదుగా తయారు చేస్తున్నాడని అర్ధం అవుతోంది. ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఆలోచిస్తే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడని శనివారం ప్రగతిభవన్లో భేటీ చెబుతుంది. గతంలోనూ అంటే 2009 ఎన్నికల్లో మహాకూటమి రూపంలో కామ్రేడ్లతో కలసి టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళింది. చాలా చోట్ల టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో లాభపడింది. ఆ అనుభవంతో కమ్యూనిస్టు పెద్దలతో కేసీఆర్ మాటలు కలిపాడ ని టాక్.
నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికే మమత దూకుడుగా ఉంది. ఆమెకు ప్రశాంత్ కిశోర్ కూడా మద్దతుగా సలహాలు ఇస్తున్నాడు. ఎన్సీపీ నేత శరద్ పవార్ లాంటి వాళ్ళతో ఆమె భేటీ జరిగింది. ఆ తరువాత యుపిఏ అనేది ముగిసిన ఎపిసోడ్ గా ప్రచారం చేశారు. కానీ దానిపై రివర్స్ అటాక్ జరిగింది. దీంతో మళ్ళీ కాంగ్రెస్ తో కూడిన యూపీఏ దిశగా ప్రశాంత్ కిశోర్ ఇటీవలి ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కెసిఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయటం హాట్ టాపిక్ గా ఉంది.

Also Read: కాంగ్రెస్ పై `కేసీఆర్` వేట

ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ భేటీ అయ్యాడు. కానీ ఆయన కాంగ్రెస్ ను వీడి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఆ భేటీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నంలో భాగం కాదని కూడా టాక్ ఉంది. ఇక కేసీఆర్ ను కమ్యూనిస్టు అగ్రనేతలు కలవటం చాలా సీరియస్ ఇష్యూ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ని కాదని కామ్రేడ్ లు కేసీఆర్ పంచన చేరే అవకాశం లేదు. జాతీయ స్థాయి సమీకరణాల కోణంలోనే అగ్రనేతలు ఆలోచిస్తారు. రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు పొత్తు ల రూపంలో త్యాగం చేసారు. అలాంటిదే 2009 పొత్తు కూడా. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి కమ్యూనిస్టులు నడుస్తున్నారు. సోనియా నిర్వహించిన మీటింగ్ లకు మిస్ కాకుండా వెళ్తారు. అదే సమయం లో మమత కు కామ్రేడ్లతో పొత్తు కుదరదు. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్ ను ముందుంచి కామ్రేడ్లు కథ నడిపిస్తున్నారని అర్థం అవుతుంది. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ , టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పొత్తుకు వెళ్లే అవకాశానికి తెరలేపారని తెలుస్తుంది.
ఏపీలో ఇప్పటికే కామ్రేడ్లు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ తో కలసి నడుస్తున్నారు. జనసేన కూడా దగ్గర అవుతుంది . మొత్తంగా కాంగ్రెస్, జనసేన, టీడీపి, కమ్యూనిస్టు లు కూటమి ఏపీలో 2024 దిశగా వెళ్లే చాన్స్ కు ఢిల్లీ కమ్యూనిస్టు పెద్దలు స్కెచ్ వేశారని వినికిడి. ఇక తెలంగాణలోనూ టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూటమికి లైన్ క్లియర్ చేయడానికి ప్రగతిభవన్లో భేటీ జరిగిందని టాక్.

Also Read: ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?

కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు కూడా చాలా కాలంగా పొత్తు దిశగా వెళ్లే అవకాశం ఉందని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా లీకులు వదిలిన సందర్భాలు లేకపోలేదు. కోవర్ట్ లు గా కొందరు సీనియర్లను రేవంత్ వర్గం భావిస్తుంది.వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల టాక్. అందుకు బలం చేకూరేలా ప్రగతి భవన్ మీటింగ్ ఉందని విశ్లేషకుల అంచనా. అదే జరిగితే 2023లోనూ తెలంగాణ కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం ఎండమావే అవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తో కూడిన కూటమి ఏర్పాటు చేస్తే , సరి. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా ఏపీ కాంగ్రెస్ మాదిరిగా అయ్యే ప్రమాదం లేకపోలేదు. సో..కమ్యూనిస్టుల భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ కాంగ్రెస్ నుపై కేసీఆర్ గురి పెట్టడన్నమాట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • communists
  • congress
  • cpi
  • cpm
  • telangana politics

Related News

Telangana Bandh Tomorrow

BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

BC Bandh : బీసీ సంఘాల నాయకులు చెబుతున్నట్లు, ఈ రిజర్వేషన్ వ్యవహారం చట్టపరమైన సన్నాహాలు లేకుండా రాజకీయ ఉద్దేశ్యాలతో ముందుకు నెట్టడం మూలాన ఇంత దూరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Latest News

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd