HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Criticizes Telangana Government Revenue Bills Assembly Meetings

KCR : ఫిబ్రవరిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

KCR : ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ముఖాముఖీగా మాట్లాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పనితీరు, నిర్బంధ పాలన పై బీఆర్ఎస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

  • Author : Kavya Krishna Date : 08-12-2024 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR
KCR

KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి (డిసెంబర్‌ 9) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ముఖాముఖీగా మాట్లాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పనితీరు, నిర్బంధ పాలన పై బీఆర్ఎస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా అవి ఎలా ఎదుర్కోవాలనే విషయాలను వారికి సూచించారు.

ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల పట్ల ప్రభుత్వం అనేక దారుణాలను ప్రదర్శించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వ్యవహారంపై కేసీఆర్‌ వ్యాఖ్యానిస్తూ… ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని, దాని మార్పు మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని ప్రజలకు గుర్తు చేయాలని కేసీఆర్‌ అన్నారు.

అంతేకాకుండా… కేసీఆర్, డిసెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రైతుబంధు పథకం, కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి మాట్లాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. వీటితో పాటు.. థర్మల్ పవర్ ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలను ప్రస్తావించాలని తెలిపారు. ఈ సభల్లో, అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆరోపణలను ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలని సూచించారు.

అంతేకాకుండా, ఫిబ్రవరి నెలలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా ప్రణాళికలు తయారు చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి తరువాత, బీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభిస్తామని, పార్టీ పటిష్టీకరణకి ఆ దిశలో పని చేస్తామని స్పష్టం చేశారు.

Read Also : Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly meetings
  • brs
  • BRS Strategy
  • congress
  • Farmers' Welfare
  • Government Failures
  • kcr
  • political strategy
  • Revenue Bills
  • telangana
  • telangana politics
  • Telangana Thalli Statue

Related News

Komatireddy

Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

మంత్రి కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధి

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd