Telangana : పదేళ్ల పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చాం – కేసీఆర్
పదేళ్ల తమ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపట్టామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించామన్నారు
- Author : Sudheer
Date : 23-04-2024 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ చర్చలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై సమాదానాలు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ (24 Hours Power Supply ) బిఆర్ఎస్ (BRS) ఇవ్వలేదు..? తదితర వాటిపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేదని ఆరోపణలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పదేళ్ల తమ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపట్టామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించామన్నారు. భవిష్యత్‌కు కూడా ప్రణాళిక రచించామన్నారు. పవర్ ప్లాంట్‌లకు శ్రీకారం చుట్టామన్నారు. కరెంటు విషయంలో మా అభివృద్ధి చూసి దేశం ఆశ్చర్యపోయిందన్నారు. రూ.13కి యూనిట్ కొన్నారని మాట్లాడారని, లాంగ్ టర్మ్ కోసం ఛత్తీస్‌గఢ్ దగ్గర తీసుకున్నామని తెలిపారు.
అలాగే రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శల ఫై కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ తప్పుడు స్వేతపత్రం విడుదల చేసి తమను బదనాం చేస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ చేసేవి అర్థం పర్థం లేని ఆరోపణలని , దేశమే నివ్వెరపోయేలా తెలంగాణ అభివృద్ధి చేశామని, అసెంబ్లీలో కాంగ్రెస్‌వాళ్ల ఆరోపణలు చూసి నవ్వుకున్నామన్నారు. ప్రైవేటు కుటుంబాల అప్పులు వేరు.. ప్రభుత్వ అప్పులు వేరని , ప్రజాఆకాంక్షలను తీర్చే ప్రయత్నంలో అప్పులు అవుతాయని, ప్రైవేటు కుటుంబాల అప్పులు వేరని, అప్పులు తెచ్చుకోవడమనేది బడ్జెట్‌లో భాగమన్నారు.
Read Also : Dating Apps : డేటింగ్ యాప్‌లు మీ వ్యక్తిగత డేటాను షేర్ చేయవచ్చు లేదా అమ్మవచ్చు..!