KTR Birthday : కేటీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపి అందరి నోర్లు మూయించిన కవిత
KTR Birthday : ఈ వివాదాల నడుమ కవిత తాజాగా కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, ఆమె అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపడం మరో విశేషం.
- By Sudheer Published Date - 11:20 AM, Thu - 24 July 25

BRS వర్కింగ్ ప్రసిడెంట్ , కేసీఆర్ తనయుడు , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు , అభిమానులు బర్త్ డే వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నారు. ఇటు సోషల్ మీడియా లోను కేటీఆర్ బర్త్ డే ( KTR Birthday )అంటూ పెద్ద ఎత్తున విషెష్ అందిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సిస్టర్ కవిత (Kavitha) ..అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుందో లేదో అంటూ అంత మాట్లాడుకున్నారు. కానీ అన్నయ్య అంటూ ఆమె విషెష్ తెలిపి అందరి నోర్లు మూయించింది.
“అన్నయ్యా కేటీఆర్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కవిత, కేటీఆర్‌ల మధ్య సంబంధాలు దూరంగా ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ విధానాలపై కవిత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాసిన విషయం, తనపై పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చేసిన ఆరోపణలు ఈ వాదనలకు బలం చేకూర్చాయి. అటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ పుట్టినరోజు నెపథ్యంలో కవిత ఇచ్చిన శుభాకాంక్షలు ఆ రెండు మధ్య మరొకసారి అనుబంధాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇది ఆకాశంలో ఆకస్మికంగా మెరిపించిన మెరుపులా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Amavasya : ఈరోజు అమావాస్య.. పూర్వీకులకు తర్పణం సమర్పించడం మంచిది
ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్ బిల్లుపై కవిత హర్షం వ్యక్తం చేయడం, తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం, ఆపై జాగృతి కార్యకర్తల దాడులు.. ఇలా వరుస సంఘటనలు బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను మరింత స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధిష్ఠానం స్పందించకపోవడం రాజకీయ విశ్లేషకుల ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంలో పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమెను బీఆర్ఎస్ దూరం పెడుతోందన్న ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.
అయితే ఈ వివాదాల నడుమ కవిత తాజాగా కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, ఆమె అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపడం మరో విశేషం. సోషల్ మీడియాలో ఈ రెండు పోస్ట్‌లు విస్తృతంగా చర్చకు దారి తీశాయి. మొత్తంగా చూసినప్పుడు, విభేదాలు ఎంతైనా ఉన్నా కుటుంబ అనుబంధం మాత్రం నిలిచినట్లుగా ఈ సంఘటనల వల్ల ప్రజల్లో సందేశం వెళ్లింది.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025