Kathi Karthika: కాంగ్రెస్ లో చేరిన కత్తి కార్తీక!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆకర్ష్ తో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
- By Balu J Published Date - 03:08 PM, Sat - 16 July 22

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆకర్ష్ తో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పీజేఆర్ కూతురు విజయారెడ్డి, ఇతర నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా కత్తి కర్తీక రేవంత్ సమక్షంలో గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి కార్తీకకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోjr స్వాగతించారు. వందలాది మంది అనుచరులతో కాంగ్రెస్ లో చేరింది కార్తీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యోగులు, నిరుద్యోగులు బడుగు బలహీన వర్గాలు దోపిడీకి గురవుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్న టీఆరెస్ ని బొంద పెడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ నష్టపోయిన రాష్ట్రాన్ని ఇచ్చిందని, 8 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం అభ్యున్నతి కోసం వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరిక కార్తీక మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.