Journalist Yogi Reddy : కూతురికి ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్
శుక్రవారం ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో డోర్లు బలవంతంగా ఓపెన్ చేయగా..ఇద్దరు ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు
- Author : Sudheer
Date : 10-08-2024 - 2:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు జర్నలిస్ట్ యోగి రెడ్డి (Journalist Yogi Reddy). ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో స్టాప్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగి రెడ్డి తన కూతురితో కలిసి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. యోగి రెడ్డి గతంలో వివిధ మీడియా ఛానళ్లలో కెమెరామెన్ గా పనిచేశాడు. ఏడాదిన్నర క్రితం స్టాఫ్ రిపోర్టర్ స్థాయికి ఎదిగాడు. సంవత్సర కాలంగా తోలివేలుగు అనే యూట్యూబ్ చానల్ లో పనిచేస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ రోజులుగా యోగి..హన్మకొండలోని ఏకశిలా పార్కు సమీపంలో నివాసం ఉంటున్నాడు. కాగా శుక్రవారం ఉదయం నుంచి తన సన్నిహితులు, మిగతా స్టాఫ్ సభ్యులు ఫోన్ చేసిన లెఫ్ట్ చేయకపోవడం తో వారంతా యోగి నివాసం వద్దకు వచ్చి చూడగా..లోనగాడియా పెట్టి ఉంది. దీంతో వారికీ అనుమానం వచ్చి డోర్ బద్దలు కొట్టి చూడగా.. యోగి తో పాటు తన కూతురు విగతజీవులుగా పడివున్నారు. ఇక ఆర్థిక సమస్యలతో యోగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also : Family Pension : ‘ఫ్యామిలీ పెన్షన్’ కావాలా ? రూల్స్ తెలుసుకోండి