Telangana Politics: బీఆర్ఎస్ లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి
బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణ బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు.
- Author : Praveen Aluthuru
Date : 16-10-2023 - 1:41 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Politics: బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. సంవత్సర కాలంగా జిట్టా బీజేపీలో ఉన్నా.. ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదని పార్టీని విమర్శించారు. దీంతో బీజేపీ జిట్టా బాలకృష్ణారెడ్డిను సస్పెండ్ చేసింది. అలాగే కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జిట్టా బాలృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో జిట్టా కాంగ్రెస్ లో చేరారు. కానీ అనూహ్యంగా ఆయన కారెక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ రోజు భువనగిరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇందుకోసం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ కు ప్లాన్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. అయితే ఈ సభలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ కండువా కప్పి జిట్టాను పార్టీలోకి ఆహ్వానించనున్నారు.దీంతో భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.
Also Read: 100 Days – 150 Crores : 100 రోజుల్లో 150 కోట్ల ఆదాయమే టార్గెట్.. ఆర్టీసీ ప్లాన్ ఇదీ