Mahaa News : ‘మా గడ్డపై ఉంటూ మాపై అసత్య ప్రచారం చేస్తారా’? – జగదీశ్ రెడ్డి
BRS : "మా గడ్డపై ఉంటూ మాపై అసత్యాలు ప్రచారం చేస్తారా?" అని ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా తీసుకుని ఆయన ప్రశ్నించారు. మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
- By Sudheer Published Date - 02:26 PM, Sun - 29 June 25

తెలంగాణలో ఇటీవల కేసీఆర్, కేటీఆర్‌లపై జరుగుతున్న అసత్య ప్రచారాలను బీఆర్‌ఎస్ నేత జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy) తీవ్రంగా ఖండించారు. “మా గడ్డపై ఉంటూ మాపై అసత్యాలు ప్రచారం చేస్తారా?” అని ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా తీసుకుని ఆయన ప్రశ్నించారు. మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మహా న్యూస్(Mahaa News)కు పట్టిన గతే మిగతా మీడియా సంస్థలకు పడుతుందని హెచ్చరించిన జగదీష్ రెడ్డి, “మీరు చేసిన దాడికి మేమూ ప్రత్యుద్ధం చేస్తాం” అని స్పష్టం చేశారు.
Trump: సెనెట్‌లో గొప్ప విజయం దక్కిందన్న ట్రంప్
సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా ముసుగులో కొందరు స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లపై కావాలని దుష్ప్రచారం సాగుతున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎగతాళి పాలన చేస్తోందని మండిపడ్డారు. గత ఏడాది నుంచి బీఆర్‌ఎస్ నేతలపై కుట్రలు సాగుతున్నాయని, దీనికి మీడియా వేదికగా మారిందని పేర్కొన్నారు. “రాజకీయాల్లో కక్ష సాధింపులు మనమే తేల్చుకుంటాం, కానీ మీడియా ముసుగులో అసత్య ప్రచారం అంగీకరించలేం” అని అన్నారు.
West Indies Coach: థర్డ్ అంపైర్‌పై నిందలు.. కోచ్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ!
కరువు పరిస్థితుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఎలాంటి చొరవ చూపడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో విత్తనాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను అజ్ఞానులుగా అభివర్ణించారు. కన్నేపల్లిలో పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. “కేసీఆర్‌ను విమర్శించడం కాదు, అభివృద్ధిపై దృష్టి పెట్టండి” అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.