IT Raids In Vivek : వివేక్ ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరులో భారీ ర్యాలీ
వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy)పై ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు (IT Rides) చేయడాన్ని ఖండిస్తూ ఆయన అనుచరులు , పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు
- By Sudheer Published Date - 02:18 PM, Tue - 21 November 23

తెలంగాణ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy)పై ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు (IT Rides) చేయడాన్ని ఖండిస్తూ ఆయన అనుచరులు , పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారుఉదయం నుంచి జరుగుతున్న తనిఖీలు.. రాజకీయ కక్షలో భాగం అని.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుందంటూ ఆందోళనకు దిగారు. వేలాది మంది జనం ఈ ర్యాలీకి తరలిరావటంతో చెన్నూరు జన సంద్రంగా మారింది. చెన్నూరులో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న బాల్క సుమన్ అరాచకాలకు, అహంకారానికి ఇది పరాకాష్ఠ అంటూ నినాదాలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయం నుండి వివేక ఇళ్లు, ఆఫీస్ లపై ఏకకాలంలో దాడులు చేశారు ఈడీ, ఐటీ అధికారులు. వివేక్‌తోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సోమాజిగూడ (Somajiguda)తోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennoor)లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈనెల 15న.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ రామంతాపూర్‌లో పట్టుబడ్డారు. ఇక.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ నుంచి 8కోట్ల రూపాయల నగదు బదిలీపై కూడా కేసు నమోదు చేసిన ఈడీ.. తనిఖీలు చేపడుతోంది. ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా జరిగినట్టు గుర్తించింది. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Monalisa: 41వ వసంతంలోకి ఆడుగుపెట్టిన మోనాలిసా