Fine Rice : జనవరిలో తెలంగాణ సర్కార్ సన్నబియ్యం పంపిణి చేయడం కష్టమే..!!
Fine Rice : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంది
- By Sudheer Published Date - 10:55 AM, Tue - 19 November 24

రేషన్ కార్డుదారులకు (White Ration Card Holders) సంక్రాంతి (Sankranti) నుంచి సన్నబియ్యం (Fine Rice) పంపిణీ చేస్తామని ప్రభుత్వం (Telangana Govt) చెప్పినప్పటికీ..అది కష్టమే అని తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు చెపుతున్న దాని ప్రకారం ఏప్రిల్ , మే నెలలో సన్నబియ్యం అందించవచ్చని తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇక మిగతా హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. రకరకాల సమస్యలతో హామీలు నెరవేర్చడం ఆలస్యం అవుతూ వస్తుంది.
ప్రతి రేషన్ దారుడికి సన్నబియ్యం అందజేయాలని సర్కార్ భావిస్తుంది. వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. దీంతో జనవరి 14 , 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉందని అంత భావించారు. బయట మార్కెట్ లో సన్నబియ్య ఖరీదు ఆకాశానికి తాకుతున్న వేళ ,..ప్రభుత్వ్హమే సన్నబియ్యం అందిస్తామని చెప్పడం తో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే సర్కార్ చెప్పినట్లు జనవరి నుండి సన్నబియ్యం పంపిణి అనేది కష్టమే అని తెలుస్తుంది.
కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు చెపుతున్నారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని..ఆలా చేసిన తర్వాతే పంపిణి చేస్తే బాగుంటుందని , లేదంటే అన్నం ముద్ద అవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి..మూడు నెలల తర్వాత అంటే ఉగాది నుంచి ఈ స్కీం అమలు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also : Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా కొండ్రు సంజయ్‌మూర్తి.. ఎవరు ?