HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ips Officer Naveen Kumar Arrest

IPS Officer Arrest : IPS ఆఫీసర్ నవీన్ కుమార్ అరెస్ట్

  • Author : Sudheer Date : 27-12-2023 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Naveen Kumar Arrest
Naveen Kumar Arrest

సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను (IPS Officer Naveen Kumar) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Retired IAS Officer Bhanwar Lal) ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అదుపులో తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఖండించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నవీన్ కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విదులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్.. అద్దెకు ఉంటోన్న భవనాన్ని చేజిక్కించుకోడానికి కుట్రలు చేసినట్టు ఫిర్యాదు అందడంతో కేసు నమోదయ్యాయింది. ఈ కేసులో రెండు రోజుల కిందట ఐపీఎస్ అధికారి భార్యను అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లను రూపొందించిడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఓర్సు సాంబశివరావు, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, ఆయన భార్య రూపా డింపుల్‌‌ను నిందితులుగా చేర్చారు. 2014లో జూబ్లిహిల్స్‌‌లో ని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లు రెంటల్ అగ్రిమెంట్ చేశామని భన్వర్ లాల్ భార్య మనిలాల్ ఫిర్యాదులోపేర్కొన్నారు. 2019 లో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంటిని ఖాళీ చేయమన్నామని, రెంటల్ అగ్రిమెంట్‌కు విరుద్దంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. నకీలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని అక్రమంగ కబ్జా చేయాలని చూస్తున్నారని భన్వర్ లాల్ సతీమణి ఆరోపించారు.

Read Also : Ayodhya: రామ మందిర నిర్మాణానికి అదనంగా 500 మంది కూలీలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • hyderabad
  • IPS Officer Naveen Kumar
  • Retired IAS Officer Bhanwar Lal

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd