HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Indiramma Houses Aadhaar Corrections Beneficiaries

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.

  • By Kavya Krishna Published Date - 10:44 AM, Wed - 10 September 25
  • daily-hunt
Indiramma Houses
Indiramma Houses

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనివల్ల డబ్బు మద్యవర్తులు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, లబ్ధిదారుల వివరాలను పరిశీలించినప్పుడు, దాదాపు 30% మంది ఆధార్ వివరాలు బ్యాంకు రికార్డులతో సరిపోలకపోవడం గమనించినట్లు సమాచారం.

Bellam Konda Srinivas : ఆలా చేస్తే ఇండస్ట్రీని వదిలివెళ్తా- బెల్లంకొండ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

ఆధార్ డేటా , బ్యాంకు ఖాతా వివరాలు సరిపోలకపోతే, లబ్ధిదారుల చెల్లింపులు నిలిచిపోతాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులు కూడా సకాలంలో డబ్బులు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ వివరాలను సరిచూడడం, ఏవైనా తప్పులు ఉంటే వాటిని త్వరితగతిన సరిదిద్దడం, పేమెంట్స్ అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు పొందుతున్న వారు తమ ఆధార్‌లో పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్, వయసు లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో లేదో తక్షణం తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. “సమయానికి సరిచేయకపోతే డబ్బులు జమ కావు, తద్వారా పథకం ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి” అని స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వం ఈ చర్యల వెనుక ఉద్దేశం పారదర్శకతను పెంపొందించడం, అవినీతి, మద్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా తగ్గించడం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన ప్రతి ఒక్కరు సమయానికి ఆర్థిక సహాయం పొందేలా చూడడమే ప్రధాన లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు. ఇక లబ్ధిదారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే తమ ఆధార్ డేటాను తనిఖీ చేసి అవసరమైన మార్పులు చేయడం తప్పనిసరి.

AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadhaar Corrections
  • APBS Payments
  • Beneficiaries
  • Indiramma Houses
  • Telangana Housing Scheme

Related News

    Latest News

    • Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

    • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

    • Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్‌

    • Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతంలో భారీ పెరుగుదల!

    • ‘Y’ Category Security : మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

    Trending News

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd