HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Inauguration Of Telanganas New Official Symbol Postponed

Telangana New Emblem : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి. 

  • Author : Pasha Date : 30-05-2024 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana New Emblem
Telangana New Emblem

Telangana New Emblem :  తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.  వాటి స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మతో కొత్త అధికారిక చిహ్నాన్ని  ఖరారు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోందనే ప్రచారం జరిగింది. దీనిపై వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి దాదాపు 200కుపైగా సూచనలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మరిన్ని చర్చల తర్వాతే అధికారిక చిహ్నం ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. దీంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసే అంశంపైనా  ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో జూన్‌ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని మాత్రమే సీఎం  రేవంత్ ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుత తెలంగాణ అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగిస్తామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని అద్దంపట్టేలా తెలంగాణ చిహ్నం ఉండాలని భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఈక్రమంలోనే కొత్త అధికారిక చిహ్నాన్ని డిజైన్ చేయించేందుకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో ఇప్పటికే పలుమార్లు  ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చర్చించారు. కొన్ని డిజైన్లను కూడా తయారు చేయించారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని.. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాలని సీఎం రేవంత్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా,  తెలంగాణ రాష్ట్ర నూతన అధికారిక చిహ్నం(Telangana New Emblem) అంటూ సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్​ అవుతోంది. ఈ లోగోలో సింహాల రాజముద్ర పైన ఉండగా, కింద అమరవీరుల స్థూపం, దానికి రెండు వైపులా వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి కంకులు ఉన్నాయి.

Also Read :Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?

2.30 నిమిషాల నిడివితో మరో గీతం

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరుస్తున్నారు. పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు.

Also Read :Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్‌సింగ్ కీలక వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telangana
  • Telangana new emblem

Related News

Vakiti Srihari fish curry Midday meal scheme

Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

Government Schools  తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • Telangana Petroleum Dealers Association

    Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు

Latest News

  • Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

  • Cm Revanth Reddy: భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Tamil Nadu Elections 2026 : సర్వే దెబ్బకు మనసు మార్చుకున్న TVK విజయ్

  • Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Silver Price : వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? ఇదే మంచి ఛాన్స్ ..ఈరోజు 15 వేలు తగ్గింపు !!

Trending News

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd