Red alert: తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ…ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక..!!.
తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వచ్చే 48గంటల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురస్తాయని ప్రకటించింది.
- Author : hashtagu
Date : 10-07-2022 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వచ్చే 48గంటల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురస్తాయని ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో భారీ వర్షాలు కురస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ సూచించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.