Harish Rao: బీజేపీ జమిలి నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నడు: మంత్రి హరీశ్ రావు
బిజెపి జమిలి నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నడు అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
- By Balu J Published Date - 04:26 PM, Wed - 13 September 23

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరినడిగినా మూడో సారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కెసిఆర్ అనే సమాధానం వస్తుందని, హుస్నాబాద్ లో కూడా మూడోసారి సతీష్ కుమార్ ని గెలిపించుకుందాం ఆయన అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయినయ్ అంటే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇది కేవలం కేసీఆర్ గారి వలన సాధ్యమైందని హరీశ్ రావు అన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మంత్రి గుర్తు చేశారు.
గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు అయినా సరే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది BRS ప్రభుత్వమని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా, కల్యాణ లక్ష్మి ఇచ్చారా, మిషన్ భగీరధ మంచినీళ్లు ఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని, నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాల్నా ఆయన మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.
Also Read: Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు: సూపర్ స్టార్ రజనీకాంత్