IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సాధారణంగా ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల పరంపర కొనసాగుతుంది
- Author : Praveen Aluthuru
Date : 14-12-2023 - 6:43 IST
Published By : Hashtagu Telugu Desk
IAS Transfers: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సాధారణంగా ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల పరంపర కొనసాగుతుంది. తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. అలాగే మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తనదైన పనితీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాగే అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి, ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్, ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీగా వరుణ్‌రెడ్డి నియామకం అయ్యారు.
Also Read: Andhra Chepala Pulusu: ఆంధ్రస్టైల్ చేపల పులుసు.. ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?